పిడుగుపాటుతో ఇద్దరు మృతి

పిడుగుపాటుతో ఇద్దరు మృతి

తాండూరు, కొడంగల్, వెలుగు: పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. పాత తాండూరుకు చెందిన పురు శేఖర్(38) కిరాణాషాపు, హోటల్ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం పనిమీద బయటికొచ్చాడు. అకస్మాత్తుగా వర్షం పడడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడి శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంచాల్ మండలం జపల్​కు చెందిన భగవంతు (34) ఆదివారం ఓ రైతు పొలంలో ఫెన్సింగ్ పనికి వెళ్లాడు.

సాయంత్రం కురిసిన ఉరుములతో కూడిన వర్షానికి భగవంతు సమీపంలోని చెట్టు కిందికి వెళ్లగా చెట్టుపై పిడుగు పడింది. దాంతో అతను స్పాట్​లోనే మరణించాడు. అలాగే.. సోమవారం కొడంగల్​ మండలం పెద్ద నందిగామలో పిడుగు పాటుతో ఫారూఖ్, సుల్తాన్​ మియా, ముస్లీమ తౌఫిక్ అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే కొడంగల్​గవర్నమెంట్ ​హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దౌల్తాబాద్​మండలం బంగ్లా తాండాలో లక్ష్మణ్​ నాయక్​కు చెందిన గేదెపై పిడుగు పడడంతో చనిపోయింది.