రంగు రంగుల వెరైటీ బల్లులను.. బ్యాగులో పెట్టుకుని విమానంలో వచ్చారు..!

రంగు రంగుల వెరైటీ బల్లులను.. బ్యాగులో పెట్టుకుని విమానంలో వచ్చారు..!

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో  విదేశీ బల్లులు పట్టుబడటం కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన  ఇద్దరు ప్రయాణికులు సతీష్ బాబు సారథి, కన్నప్పన్ శరవణన్ విష్ణులు బ్యాంకాక్ నుంచి  తెచ్చిన  వస్తువులను   శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు   తనిఖీలు చేయగా..మొత్తం 14 విదేశీ బల్లులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.  

 ఇందులో  4 గ్రీన్ కీల్‌డ్‌ లిజార్డులు, 10 గిర్డ్ లే లిజార్డులు ఉన్నాయి.   బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసిన లిజార్డులను తిరిగి బ్యాంకాక్‌కి పంపించారు.  వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు ఇద్దరు ప్రయాణికులను విచారిస్తున్నారు.సెప్టెంబర్ 8న మధ్యామ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

►ALSO READ | బ్యాంక్ అకౌంట్లో కోట్లలో క్యాష్.. సంపదతో సంతోషానికి గ్యారెంటీ లేదంటున్న టెక్కీ
 
 శంషాబాద్ ఎయిర్ పోర్టులో  విదేశాల నుంచి   డ్రగ్స్, బంగారం, విదేశీ వస్తువులు,విదేశీ కరెన్సీ, ఆ మధ్య ఒకసారి  విషపూరిత పాములు పట్టుబడటం మనం చూశాం.ఇటీవల ఆగస్టు 28 శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది. ప్యాసెంజర్ ను అదుపులోకి తీసుకున్నారు.