‘గాంధీ’లో డాక్టర్‌పై దాడి చేసిన వారి అరెస్ట్

‘గాంధీ’లో డాక్టర్‌పై దాడి చేసిన వారి అరెస్ట్

గాంధీ హాస్పిటల్లో మంగళవారం డాక్టర్‌పై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించబోమని పోలీసులు తెలిపారు. వైద్యులపై దాడి చేస్తే చాలా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కరోనా విజృంభిస్తోన్న ఈ సమయంలో వైద్యులే మన ఫ్రంట్‌లైన్ లీడర్లని పోలీసులు అన్నారు.

మంగళవారం రాత్రి ఓ వ్యక్తి కరోనా వల్ల మృతిచెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ వ్యక్తి చనిపోయాడని ఆగ్రహిస్తూ అతని బంధువులు దాడికి దిగారు. నేరుగా హాస్పిటల్ మూడో ఫ్లోర్‌లోని ఐసీయూలోకి వెళ్లి అక్కడున్న ఓ డాక్టర్ పై దాడి చేశారు. దాంతో డాక్టర్లంతా తమకు భద్రత కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు డాక్టర్‌పై దాడిచేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

For More News..

భగీరథుడు శివుడు.. అపర భగీరథుడు కేసీఆర్

ఏపీలో టైలర్లకు రూ. 10 వేలు విడుదల

వైరల్ ఆడియో: గాంధీలో అన్నీ ఇస్తున్నామన్న కేసీఆర్.. ఇప్పుడేమంటారో?