జవహర్ నగర్లో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం

జవహర్ నగర్లో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం

మేడ్చల్ జిల్లా, జవహార్ నగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. బ్రిజేష్ కుమార్ 9, ప్రిన్స్ కుమార్ 10వ తరగతి చదువుతున్నారు. ఇవాళ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాకపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ప్రిన్స్ కుమార్ అనే విద్యార్థి ఇంట్లో ఉన్న అల్మారాలో రూ. 17500 నగదు తీసుకొని వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జవహార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచరణ చేపట్టారు.