V6 News

అరేబియా సముద్రంలో తుఫాన్.. బైపోర్ జోయ్ గా పేరు..

అరేబియా సముద్రంలో తుఫాన్.. బైపోర్ జోయ్ గా పేరు..

ఆగ్నేయ అరేబియా సముద్రంలో  ఏర్పడిన తుఫాను మంగళవారం ఉదయం అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తరం వైపునకు వెళ్లి తూర్పు మధ్య అరేబియా సముద్రం, ఆగ్నేయం దిశగా కదులుతూ రానున్న 12 గంటల్లో మళ్లీ తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.  దీనికి సైక్లోన్​ బైపర్​జోయ్​గా పేరు పెట్టారు.  

వానలు  కురిసే ప్రాంతాలివే.. 

జూన్​ 10 వరకు కేరళ, కర్ణాటక, మణిపుర్​, అరుణాచల్​ ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  వచ్చే ఐదు రోజులలో కేరళ, లక్షద్వీప్, దక్షిణ కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి, మోస్తరు  వర్షాలు కురిసే అవకాశం ఉందని  ఐఎండీ  తెలిపింది. జూన్ 6, 7, 10 తేదీలలో అండమాన్ మరియు నికోబార్ దీవులలో, జూన్ 6 నుండి 10 వరకు కేరళలో మరియు జూన్ 9,10 తేదీలలో దక్షిణ  కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. వచ్చే ఐదు రోజుల్లో బిహార్​, జార్ఖండ్​, వెస్ట్​ బెంగాల్, ఏపీ, తెలంగాణల్లో వేడి గాలులు కొనసాగుతాయి.