టాప్ బ్రోకరేజిల రికమండేషన్స్‌‌‌‌

టాప్ బ్రోకరేజిల రికమండేషన్స్‌‌‌‌

బిజినెస్ డెస్క్, వెలుగు: యూబీఎస్‌‌‌‌‌‌‌‌, నోమురా, క్రెడిట్ సూజ్, మోతీలాల్‌‌‌‌‌‌‌‌ ఓస్వాల్ వంటి టాప్ బ్రోకరేజి కంపెనీలు ఇన్వెస్టర్ల కోసం స్టాక్ రికమండేషన్స్‌‌‌‌‌‌‌‌  ప్రకటించాయి. 2022 ను లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు, వచ్చే ఏడాది ఇబ్బందులు తప్పవని పేర్కొన్నాయి. వివిధ బ్రోకరేజిల అంచనాలు ఇలా ఉన్నాయి..

యూబీఎస్‌‌‌‌‌‌‌‌..

వచ్చే ఏడాది నిఫ్టీ పెద్దగా కదలదని యూబీఎస్ అంచనా వేస్తోంది. ఇందుకు కారణం వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండడమేనని తెలిపింది. ఈ బ్రోకరేజి కంపెనీ నిఫ్టీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను 18,000 గా నిర్ణయించింది. తాజాగా మార్కెట్‌‌‌‌‌‌‌‌లు పడినప్పటికీ, ఇతర ఎమర్జింగ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లతో పోలిస్తే  మన మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఇంకా ఎక్కువ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌తోనే  కదులుతోందని యూబీఎస్ పేర్కొంది. ఈ బ్రోకరేజి కంపెనీ బ్యాంకింగ్, కన్జూమర్ స్టాపల్స్‌‌‌‌‌‌‌‌ (రోజు వారీ వాడే ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు), ఆటో సెక్టార్లపై పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. టెలికం, ఇండస్ట్రియల్స్‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ, యుటిలిటీస్ సెక్టార్లపై న్యూట్రల్‌‌‌‌‌‌‌‌గా ఉంది. మెటల్స్‌‌‌‌‌‌‌‌, మైనింగ్‌‌‌‌‌‌‌‌, ఐటీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌, కన్జూమర్ డిస్క్రిషనరీ (ఏసీలు వంటి ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు) సెక్టార్లపై నెగెటెవ్‌‌‌‌‌‌‌‌గా ఉంది.  హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంద్రప్రస్థా గ్యాస్‌‌‌‌‌‌‌‌, మారుతి సుజుకీ, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ లైఫ్‌‌‌‌‌‌‌‌, జొమాటో షేర్లకు ‘బై’ రేటింగ్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది. 

నోమురా..

ఇండియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ వచ్చే ఏడాది ఫ్లాట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని నోమురా అంచనావేసింది.  2023 లో నిఫ్టీ 19,030 వరకు  వెళుతుందని పేర్కొంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా అనిశ్చితి కొనసాగడం, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ సమస్యల వలన మార్కెట్ పెరుగుదల పరిమితంగా ఉంటుందని తెలిపింది. షార్ట్‌‌‌‌‌‌‌‌ టర్మ్‌‌‌‌‌‌‌‌లో  దేశ ఎకానమీ గ్రోత్‌‌‌‌‌‌‌‌పై ఆధారపడి కంపెనీల ఎర్నింగ్స్ ఉంటాయని అంచనావేసింది. డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువగా ఆధారపడే సెక్టార్లకు ఈ బ్రోకరేజి కంపెనీ  ప్రాధాన్యం ఇచ్చింది. ఫైనాన్షియల్స్‌‌‌‌‌‌‌‌, కన్జూమర్ స్టాపుల్స్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా లేదా కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌, టెలికం సెక్టార్లపై  పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆయిల్‌‌‌‌‌‌‌‌ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లపై న్యూట్రల్‌‌‌‌‌‌‌‌గా ఉంది. మెటల్స్‌‌‌‌‌‌‌‌, కన్జూమర్ డిస్క్రిషనరీ, ఐటీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌పై నెగెటెవ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ కార్డ్‌‌‌‌‌‌‌‌, హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రిటానియా, డాబర్ ఇండియా, ఎల్ అండ్ టీ, కేఈసీ ఇంటర్నేషనల్ షేర్లకు  నోమురా ఓవర్ వెయిట్ ఇచ్చింది. అంటే కొనొచ్చని రికమండ్ చేసింది. జైడస్‌‌‌‌‌‌‌‌, మెడ్‌‌‌‌‌‌‌‌ప్లస్‌‌‌‌‌‌‌‌, ఐజీఎల్‌‌‌‌‌‌‌‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌కు న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది. ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌, పెరిసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌, ఎం అండ్ ఎం, హనీవెల్‌‌‌‌‌‌‌‌ ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌, ఇన్ఫో ఎడ్జ్‌‌‌‌‌‌‌‌ షేర్లకు  దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది.

మోతీలాల్ ఓస్వాల్‌‌‌‌‌‌‌‌..

క్రెడిట్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌‌‌‌‌ (అప్పులివ్వడం పెరగడం), క్యాపిటల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పెండిచర్‌‌‌‌‌‌‌‌..ఈ రెండు అంశాలు కొత్త ఏడాదిలో కీలకంగా ఉంటాయని మోతీలాల్ ఓస్వాల్ అంచనావేస్తోంది. బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్స్‌‌‌‌‌‌‌‌, ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ గూడ్స్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిమెంట్‌‌‌‌‌‌‌‌, హౌసింగ్‌‌‌‌‌‌‌‌, డిఫెన్స్‌‌‌‌‌‌‌‌, రైల్వేస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లపై ఫోకస్ పెట్టమని సలహా ఇచ్చింది.  ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ, ఐటీసీ, ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, మారుతి సుజుకీ, టైటాన్‌‌‌‌‌‌‌‌, టీసీఎస్‌‌‌‌‌‌‌‌, అల్ట్రాటెక్ సిమెంట్‌‌‌‌‌‌‌‌, అపోలో హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌, పీఐ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌, మాక్రోటెక్ డెవలపర్స్‌‌‌‌‌‌‌‌, ఇండియన్ హోటల్స్‌‌‌‌‌‌‌‌, భారత్ ఫోర్జ్‌‌‌‌‌‌‌‌, వెస్ట్‌‌‌‌‌‌‌‌లైఫ్ ఫుడ్‌‌‌‌‌‌‌‌వరల్డ్‌‌‌‌‌‌‌‌, న్యూట్రాల్‌‌‌‌‌‌‌‌ షేర్లు  మోతీలాల్ ఓస్వాల్ టాప్ పిక్స్‌‌‌‌‌‌‌‌.

క్రెడిట్ సూజ్‌‌‌‌‌‌‌‌..

క్రెడిట్ సూజ్ ఫైనాన్షియల్స్‌‌‌‌‌‌‌‌, సిమెంట్‌‌‌‌‌‌‌‌, కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌ వంటి సెక్టార్లపై పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. కన్జూమర్ డిస్క్రిషనరీ (కొనాలనుకుంటేనే కొనేవి) సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే కన్జూమర్ స్టాపుల్స్‌‌‌‌‌‌‌‌ (తప్పనిసరిగా కొనాల్సినవి) సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఇండస్ట్రియల్స్‌‌‌‌‌‌‌‌, ఐటీ, మెటల్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లకు  దూరంగా ఉండాలనే రేటింగ్ ఇచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్‌‌‌‌‌‌‌‌ సిమెంట్‌‌‌‌‌‌‌‌, ఇండస్‌‌‌‌‌‌‌‌ఇండ్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, బ్యాంక్ ఆఫ్ బరోడాపై  ‘బై’ కాల్ రేటింగ్ ఇచ్చిన క్రెడిట్ సూజ్‌‌‌‌‌‌‌‌, టీసీఎస్‌‌‌‌‌‌‌‌పై న్యూట్రల్ రేటింగ్‌‌‌‌‌‌‌‌ను, డీమార్ట్‌‌‌‌‌‌‌‌పై  అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెర్ఫార్మ్‌‌‌‌‌‌‌‌ (పెరగదనే) రేటింగ్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది.