
తిరుపతి: ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెబుతూ పబ్జి గేమ్ మొదలుపెట్టిన యువకుడు.. ఆటలో ఫ్రెండ్స్ తో వెనుకబడిపోతున్నానని ఒత్తిడికి గురై… మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి లో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. ఆత్మహత్య చేసుకున్న మైనర్ యువకుడు టీటీడీ ఉద్యోగి కుమారుడు కావడంతో స్థానికులను విషాదంలో ముంచెత్తింది.
తిరుపతి మంగళం నివాసముంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి భాస్కర్ కుమారుడు తేజేష్ (17) పబ్ జీ ఆట ఆడుకుంటూ మరికొందరు స్నేహితులతో జత కలిశాడు. కొద్ది రోజులుగా ఫ్రెండ్స్ తో పోటీ పడలేక వెనుకబడిపోయాడు. ఎంత ప్రయత్నించినా వెనుకబడిపోతున్నానని ఒత్తిడికి గురయ్యాడు. తనకు రూ.3 లక్షలు ఇవ్వాలని.. గన్ కొనుక్కుంటానని తన తండ్రిని తేజేష్..కోరగా ఆయన నిరాకరించాడు. ఆటల కోసం వద్దు.. ఆటలు ఆపేసి ఏదైనా వ్యాపారం చేసుకో.. డబ్బులు సిద్ధం చేస్తానని చెప్పడంతో నిరుత్సాహానికి గురయ్యాడు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మా వాడు బయటకు వెళ్లకపోతే.. వారి ఫ్రెండ్సే ఇంటి వద్దకు వచ్చి మరీ పిలుచుకుని వెళ్లేవారని.. వారి వల్లే ఇలా ఆత్మహత్య చేసుకున్నానని కంటతడిపెట్టి విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. అలిపిరి ఎస్.ఐ పరమేశ్వర నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.