రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో.. కొత్త సినిమా షురూ

రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో.. కొత్త సినిమా షురూ

విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ కలిసి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌కి నిర్మాత కె.ఎస్ రామారావు క్లాప్ కొట్టగా, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్ కెమెరా స్విచాన్ చేసారు. నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు.

నటుడు సుమన్ స్క్రిప్ట్‌‌ను టీమ్‌‌కు అందజేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, కాట్రగడ్డ ప్రసాద్, కొల్లి రామకృష్ణ, డి.ఎస్ రావు, సుహాసిని పాండ్యన్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ‘స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియో గించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ చిత్ర కథాంశం. సెంటిమెంట్, థ్రిల్లింగ్ అంశాలతో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది’ అని దర్శక నిర్మాతలు చెప్పారు.