ఉప్పల్, వెలుగు: ఓయూకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ.1,000 కోట్లు వెంటనే రిలీజ్చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్కాలేజీలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, ప్రొఫెసర్రామ్షెఫర్డ్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ఆర్ఎల్ మూర్తి తదితరులు మాట్లాడారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఓయూలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి, రాజీవ్యువ వికాసం ఫండ్స్విడుదల చేయాలని కోరారు. ఆయా సమస్యలపై ఈ నెల 7న ఓయూలో భారీ నిరుద్యోగ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
