ఆగస్టు 15లోగా యూనిఫామ్స్ ఇవ్వాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఆగస్టు 15లోగా యూనిఫామ్స్ ఇవ్వాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఆగస్టు 15 నాటికి ఒక జత, ఆగస్టు 25 నాటికి రెండవ జత యూనిఫామ్స్ అందజేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని 358 స్వయం సహాయక సంఘాల టైలర్ల ద్వారా ఈ దుస్తులు కుట్టించి సమయానికి విద్యార్థులకు అందజేసేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్షలో, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు పత్తి, కందులు, నువ్వులు, వేరుశనగ వంటి ప్రత్యామ్నాయ పంటల  సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు.