కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో పనిచేసిన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన గాండ్ల లక్ష్మయ్య(56) గతేడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయనకు ఆర్టీసీ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్సురెన్స్ చెల్లించారు. గురువారం లక్ష్మయ్య భార్య అంజలికి రూ.కోటి ఇన్సురెన్స్ చెక్కును యూబీఐ చీఫ్ జీఎం రవీంద్రబాబు, కరీంనగర్ రీజినల్ హెడ్ డి.అపర్ణ రెడ్డి అందజేశారు.
