కేంద్ర బ‌డ్జెట్ కొన్ని రాష్ట్రాల‌ బడ్జెట్‌లా ఉంది : క‌విత

కేంద్ర బ‌డ్జెట్ కొన్ని రాష్ట్రాల‌ బడ్జెట్‌లా ఉంది :  క‌విత

కేంద్ర బ‌డ్జెట్ కేవలం కొన్ని రాష్ట్రాల‌ బడ్జెట్‌లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత విమ‌ర్శించారు. మోడీ ప్రభుత్వ వైఫల్యానికి ఈ బడ్జెట్ నిదర్శనమని అన్నారు. రూ. 10 ల‌క్షల ఆదాయం వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు క‌ల్పిస్తార‌ని ఆశించిన సగటు జీవికి నిరాశే మిగిల్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతాలు ఇస్తున్నందున కేంద్రం కల్పిస్తున్న రాయితీ ఏ మాత్రం సరిపోదని చెప్పారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు మాత్రమే ల‌బ్ధి చేకూరేలా కేంద్రం డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టుల‌ను ప్రక‌టించింద‌ని క‌విత విమ‌ర్శించారు. మౌలిక‌ స‌దుపాయాల క‌ల్పన కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నార‌ని చెప్పార‌ని, అయితే వాటిని ఏ ప్రాజెక్టులకు వినియోగిస్తారో చెప్పలేదని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం దాదాపు రూ.1000 కోట్ల వ‌ర‌కు బాకీ ఉందన్న కవిత.. బకాయిలు చెల్లించమని ఆర్థిక మంత్రిని కోరుతామని అన్నారు.