అన్నదాతల భూములు అమ్మాలని కేంద్రం యత్నం

అన్నదాతల భూములు అమ్మాలని కేంద్రం యత్నం

న్యూఢిల్లీ: కేంద్రం వడ్లు కొనాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ చేపట్టిన వరి దీక్షలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధరను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించకపోతే.. వారు మడమతిప్పని పోరాటం జరుపుతారని చెప్పారు. ఎంఎస్పీ చట్టం తీసుకురావాలన్నారు. ఇది రాజకీయ దీక్ష కాదని.. ఓట్ల కోసం ఇక్కడ ఎవరూ దీక్షలు చేయడం లేదన్నారు. బోర్లకు మీటర్లు పెట్టాలని చట్టాలు తీసుకొస్తే.. రైతులు బతుకుతారా అని క్వశ్చన్ చేశారు. 

రైతుల కోసం ఎవరు పోరాడినా తాము మద్దతు తెలుపుతామని టికాయత్ స్పష్టం చేశారు. అన్నదాతల సమస్యల కోసం కొట్లాడే వారికి భారతీయ కిసాన్ యూనియన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతుల బాగు కోసం పని చేసే వారికి తాము మద్దతుగా ఉంటామన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న ‘రైతు బంధు’ పథకాన్ని ఆయన మెచ్చుకున్నారు. మొత్తం దేశంలో రైతుల విషయంలో తెలంగాణ అత్యుత్తమ పాలసీని అమలు చేస్తోందన్నారు. అదే విధంగా తెలంగాణలో ఇస్తున్నట్లు ఫ్రీ విద్యుత్.. దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల భూములు అమ్మడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. 

కేంద్ర ప్రభుత్వానికి అన్నదాతల సమస్యలు పట్టవని..ఎన్నికలప్పుడే వారికి రైతులు గుర్తుకు వస్తారని టికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హిందూ,ముస్లింల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఇది సరైన పద్దతి కాదని సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం:

హిందీ ‘జెర్సీ’ మూవీ వాయిదా

ట్విట్టర్​ నుంచి ఎడిట్​ ఫీచర్​

నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న జేఎన్యూ స్టూడెంట్లు