ఢిల్లీలో మరింత వైభవంగా బోనాలు

ఢిల్లీలో మరింత వైభవంగా బోనాలు

వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ప్రకటించారు.  టూరిజం శాఖ నుంచి నిధులు అందేలా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  దేశ రాజధానిలో మరింత వైభవంగా బోనాల ఉత్సవాలు జరిగేందుకు తోడ్పాటు అందిస్తామని చెప్పారు. లాల్ దర్వాజా బోనాల కమిటీ, ఇతర దేవాలయాలను కలుపుకొని ఉత్సవాలు నిర్వహించాలని ఆయన సూచించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ, హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు జరుగుతాయని కొనియాడారు.