విమోచన వేడుకలకు అమిత్షా రావట్లే..చీఫ్ గెస్ట్గా కిషన్రెడ్డి

విమోచన వేడుకలకు అమిత్షా రావట్లే..చీఫ్ గెస్ట్గా కిషన్రెడ్డి

 

  • విమోచన వేడుకలకు అమిత్ షా దూరం
  • చీఫ్ గెస్ట్‌‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
  • పరేడ్ గ్రౌండ్ వేదికగా విమోచన వేడుకలు

హైదరాబాద్, వెలుగు:కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కావడం లేదు. దీంతో కేంద్రం నుంచి ఓ సీనియర్ మంత్రిని చీఫ్ గెస్ట్​గా పిలవాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. 

అయితే, అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డియే ముఖ్య​అతిథిగా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 

మూడేండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో కార్యక్రమం చేపడుతోంది. 

ప్రస్తుతం జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల్లో అమిత్ షా బీజీగా ఉండడంతో ఆయన ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 17న పరేడ్ గ్రౌండ్  లో విమోచన వేడుకలు నిర్వహించనున్నారు. 

ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​గా కిషన్ రెడ్డి తో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అటెండ్ అయ్యే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా వేడుకల్లో పాల్గొననున్నారు. 

వేడుకల ఏర్పాట్లను బీజేపీ ఎంపీలు పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రులు అమిత్ షా, షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని ఆహ్వానించడం గమనార్హం.