కేబినెట్లో మాజీ నక్సలైట్లు..యువతను నక్సలిజం వైపు మళ్లించే కుట్ర: బండి సంజయ్

కేబినెట్లో మాజీ నక్సలైట్లు..యువతను నక్సలిజం వైపు మళ్లించే కుట్ర: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాజీ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజ య్ ఆరోపించారు. నక్సలిజం ఒక సిద్ధాంతమని, దానిని అంతం చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, నక్సలైట్ల చేతిలో బలైన వేలాది అమాయక గిరిజనుల, పోలీసుల త్యాగాలను అవమానించడమేనని మంగళవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నక్సలిజాన్ని అణచివేయడంలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను ఆయన గుర్తు పెట్టుకోవాలని అన్నా రు.

 నక్సలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పద్మ అవార్డులకు సిఫారసు చేశారని తెలిపారు. తాజాగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా అదే సిద్ధాంతానికి చెందిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. ఇది యాదృచ్ఛికం కాదని తెలంగాణ యువతను తిరిగి నక్సలిజం వైపు మళ్లించే కుట్ర అని అభిప్రాయపడ్డారు.