బీజేపీతోనే దేశాభివృద్ధి : మంత్రి బండి సంజయ్

బీజేపీతోనే దేశాభివృద్ధి : మంత్రి బండి సంజయ్
  • పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

/నిర్మల్/మంచిర్యాల/గన్నేరువరం/సుల్తానాబాద్, వెలుగు: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజి వద్ద పార్టీ జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీతోనే దేశాభివృద్ధి, గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో  బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి స్వీట్లు పంచారు. 

బీజేపీతోనే విప్లవాత్మక సంస్కరణలు

అనేక విప్లవాత్మక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచంలోనే భారత్ ను మూడో ఆర్థిక శక్తిగా నిలిపిన ఘనత బీజేపీదేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్మల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నేతలు రావుల రాంనాథ్, సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్ లో జిల్లా అధ్యక్షుడు రితీశ్​రాథోడ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.

పేదల సంక్షేమం, దేశాభివృద్ధికి బీజేపీ కృషి 

పేదల సంక్షేమం, దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ స్టేట్ వైస్​ప్రెసిడెంట్​వెరబెల్లి రఘునాథ్​రావు అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆఫీసులో పార్టీ జెండా ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్​గౌడ్, నాయకులు ముఖేశ్​గౌడ్, దుర్గం అశోక్, ఎ.శ్రీదేవి, వెంకటేశ్వర్​రావు పాల్గొన్నారు.