వ్యాపారాలు చేయడంలో సింధీలు దిట్టలు : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

వ్యాపారాలు చేయడంలో సింధీలు దిట్టలు : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న ఒక ప్రాచీన, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన సమాజం సింధీలదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. సింధీల ఆరాధ్య దైవం ఝూలేలాల్ జీ జయంతి సందర్భంగా కరీంనగర్ లోని గాంధీ రోడ్ వైశ్యా భవన్ సమీపంలో సింధీలు చేటీ చంద్​ పర్వదినం పేరిట కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకలకు బండి సంజయ్ హాజరై మాట్లాడుతూ దేశ విభజన సమయంలో సింధీలు నివసించే ప్రాంతమంతా పాకిస్తాన్ లోకి వెళ్లిపోయిందన్నారు. వ్యాపారం చేయడంలో సింధీలు దిట్ట. ప్రపంచంలోనే అపర కుబేరుల స్థానంలో ఉన్న అదానీ కుటుంబానివి సింధీ మూలాలేనని వెల్లడించారు.