
దామగుండం రాడార్ సెంటర్ దేశ భద్రతకు సంబంధించినదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దామగుండం రాడార్ సెంటర్ ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలోనే జీవో 44 ఇచ్చారు.. అన్ని అనుమతులు అప్పుడే వచ్చాయన్నారు. ఇపుడు కావాలనే బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారు..అది కరెక్ట్ కాదని అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశ సైనికులను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ దన్నారు. దేశ భద్రతపై బీఆర్ఎస్ కు బాధ్యత లేదు.. వాళ్లకు కుటుంబ శ్రేయస్సే ముఖ్యమన్నారు.
అటవి సంరక్షణ చట్ట ప్రకారమే దామగుండం రాడార్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి. దేశ సైనికులను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ దని విమర్శించారు. దేశ సమగ్రతకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందా? అని ప్రశ్నించారు. బైసన్ పోల్ గ్రౌండ్ లో సెక్రటేరియట్ కడతామని ఎందుకు అడిగారని ప్రశ్నించారు. దేశ భద్రత కోసం అప్పటి మన్మోహన్ సర్కార్ రాడార్ స్టేషన్ నిర్మాణం చేపట్టిందన్నారు.
దామగుండంలోని రామలింగేశ్వర గుడిని మరింత డెవ్ లప్ చేస్తామన్నారు కిషన్ రెడ్డి. నష్టపోతున్న చెట్ల కోసం పరిహారంగా అటవి శాఖకు రూ.134 కోట్లు ఇస్తున్నామన్నారు. దామగుండంలో చెట్లు కొట్టేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పర్యావరణ సంరక్షణలో ఆర్మీ ముందుంటుందన్నారు. రాడార్ సెంటర్ నిర్మాణం వల్ల రాష్ట్రానికి మంచి పేరు వస్తుందన్నారు.
రాడార్ సెంటర్ తో చాలా మందికి ఉపాధి వస్తుందని చెప్పారు. రాడార్ సెంటర్ నిర్మాణం వల్ల అటవి శాఖకు ఎలాంటి ఇబ్బంది రాదన్నారు. 14 ఏళ్లుగా రాడార్ సెంటర్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తమిళనాడు తర్వాత తెలంగాణకు రాడార్ సెంటర్ రావడం విశేషమన్నారు కిషన్ రెడ్డి.