
యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వం ఆసత్య ఆరోపణలు చేస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ సరిగా లేకపోవడమే యూరియా కొరతకు కారణమన్నారు. దేశంలో యూరియా కొరత ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడగ్గానే 50శాతం యూరియా పంపామన్నారు. మరో 50 శాతం 2 రోజుల్లో చేరుతుందన్నారు కిషన్ రెడ్డి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక ఉంటే యూరియా సమస్య వచ్చేది కాదన్నారు. అయినా అడిగిన వెంటనే కేంద్రం యూరియా ఎప్పటికప్పుడు సరఫరా చేస్తుందన్నారు కిషన్ రెడ్డి.