మాస్ పార్టీగా బీజేపీ ఎదుగుతోంది..మిగతా పార్టీలకు బీజేపీకి చాలా తేడా : కిషన్ రెడ్డి

మాస్ పార్టీగా బీజేపీ ఎదుగుతోంది..మిగతా పార్టీలకు బీజేపీకి  చాలా తేడా : కిషన్ రెడ్డి

మాస్ పార్టీగా బీజేపీ ఎదుగుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.   పోలింగ్ బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు సభుత్వ నమోదు బీజేపీ మాత్రమే చేస్తుందన్నారు. సికింద్రాబాద్ లో పార్టీ వర్క్ షాప్ కు హాజరైన నేతలను ఉద్దేశించి మాట్లాడారు కిషన్ రెడ్డి. మిగతా కుటుంబ పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉందన్నారు . మిగతా పార్టీలు అవినీతికి పాల్పడుతూ కుటుంబం కోసం పని చేసే పార్టీలన్నారు. ప్రజల కోసం సమాజం కోసం పని చేసే పార్టీ బీజేపీ అని అన్నారు. సిద్ధాంతాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీ పని చేస్తుందన్నారు.  ఒక నియమావళి ప్రకారం బీజేపీ పని చేస్తుందని చెప్పారు.

 దేశ వ్యాప్తంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వ కలిగిన పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు.  పార్లమెంట్ ఎన్నికలో మంచి ఫలితాలను సాధించామన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ మొదటి , రెండో స్థానంలో ఉన్న చోట్ల  పోలింగ్ బూత్ లను పటిష్ఠం చేయాలన్నారు. దేశంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు.  జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే మూడో సారి ప్రధాని అయ్యారు. మూడో సారి ప్రధాని అయిన వ్యక్తీ నరేంద్ర మోడీనేనన్నారు కిషన్ రెడ్డి.