
కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకని ప్రశ్నించారు. ఇన్నాళ్లు విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకుని తిరిగిందని, అందుకే ఈడీ ఆమె ఇంటికి వెళ్లిందన్నారు. ఇకనైనా కవిత విచారణకు సహకరించాలని సూచించారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదని, దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇవాళ రాత్రికి కవితను ఫ్లైట్‌లో హస్తినకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం న్యాయవాదులతో కలిసి కేటీఆర్, హరీశ్ రావు కూడా ఢిల్లీ వెళ్తారని సమాచారం.
మరోవైపు కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్, హరీశ్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వారించారు. అధికారులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.