జీహెచ్ఎంసీలో నిధుల కొరతతో బస్తీల్లో సమస్యలు తీరట్లేదు : కేంద్రమంత్రి కిషన్రెడ్డి

జీహెచ్ఎంసీలో నిధుల కొరతతో బస్తీల్లో సమస్యలు తీరట్లేదు : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
  • బన్సీలాల్​పేటలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి బస్తీబాట

పద్మారావునగర్, వెలుగు: జీహెచ్ఎంసీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా బస్తీల్లో కనీస సమస్యలు పరిష్కారం కావడం లేదని, ముఖ్యంగా వర్షపు నీటి కాలువల్లో పూడికతీత లేక రోడ్లపై నీరు పారడం, వీధి లైట్లు సరిగా వెలగకపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సనత్​నగర్ నియోజకవర్గం బన్సీలాల్​పేట్ డివిజన్​లోని చాచా నెహ్రూ నగర్​లో గురువారం ఆయన అధికారులతో కలిసి బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకొని, తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం బాల్యవివాహాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.  బాల్యవివాహాలు సామాజిక దురాచారమని, అవి బాలికల ఆరోగ్యం, విద్యపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.