ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేస్తాం: కిషన్‌‌‌‌ రెడ్డి 

ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేస్తాం: కిషన్‌‌‌‌ రెడ్డి 


ముషీరాబాద్, వెలుగు: ప్రజలకు మేలు చేసే ఆసుపత్రులను మరింత పటిష్ఠం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  మంగళవారం విద్యానగర్‌‌‌‌‌‌‌‌లోని ఎస్‌‌‌‌వీఈఎస్‌‌‌‌ ఉన్నత పాఠశాలలో అభినందన అప్నాఘర్ ఫౌండేషన్‌‌‌‌ సహకారంతో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నిర్మించిన షెడ్డు, పవర్‌‌‌‌‌‌‌‌ బోర్‌‌‌‌‌‌‌‌ ను ఎంపీ డాక్టర్‌‌‌‌‌‌‌‌  కె. లక్ష్మణ్‌‌‌‌ తో కలిసి కేంద్రమంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, బస్తీల్లో మంచినీటి సమస్యలు తలెత్తకుండా పవర్ బోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సేవకులుగా వచ్చిన అటెండర్స్, ఆశా వర్కర్లను దృష్టిలో ఉంచుకొని షెడ్డు నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే సుమారు 33 ఆసుపత్రిలో  కేంద్ర నిధులతో  షెడ్డు నిర్మాణం పూర్తయ్యాయన్నారు.  కార్యక్రమంలో అభినందన అప్నా ఘర్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ ఈ భవాని, రమేశ్ రామ్, విశ్వనాథ్ శాస్త్రి,  నరేశ్, కిశోర్, శేష సాయి, ప్రసాద్, రాజేందర్,  శ్రీనివాస్, సత్యనారాయణ, చంద్రశేఖర్, మురళి, శ్రీధర్, కిషోర్ తోపాటు ఫౌండేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.