కరోనాతో ప్రజలు చస్తుంటే రాజకీయాలేంటి?

కరోనాతో ప్రజలు చస్తుంటే రాజకీయాలేంటి?

హైదరాబాద్ ఆస్పత్రుల్లో సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. గాంధీ హాస్పిటల్ ను సందర్శించిన ఆయన.. కరోనా బాధితులకు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. గాంధీలో ఆక్సిజన్, రెమ్ డెసివిర్ మందుల కొరత లేదన్నారు . గాంధీకి వచ్చిన ఏ వ్యక్తి వ్యాక్సిన్ లేక వెళ్లకూడదన్నారు. రేపటి వరకు హైదరబాద్ హాస్పిటల్స్ పరిశీలిస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనాను ఎదుర్కొంటామని చెప్పారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబం శవాలపై రాజకీయాలు చేస్తోందన్నారు. కరోనాతో ప్రజలు చస్తుంటే రాజకీయాలేంటని ప్రశ్నించారు. కేంద్రం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. కేంద్రం రాష్ట్రాలపై వివక్ష చూపుతుందనడం సరికాదన్నారు. వరంగల్ ,కరీంనగర్ లకు కూడా ఆక్సిజన్ తయారీ కేంద్రం కేటాయిస్తామన్నారు. కర్ఫ్యూ, లాక్ డౌన్ రాష్ట్రాల ఇష్టానికే వదిలేశామన్నారు.