హునర్ హాట్ కార్యక్రమంలో కేంద్రమంత్రి అబ్బాస్ నఖ్వీ

హునర్ హాట్ కార్యక్రమంలో కేంద్రమంత్రి అబ్బాస్ నఖ్వీ

హిజాబ్ పై ఇండియాలో బ్యాన్ లేదన్నారు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుందన్నారు. వారు పెట్టిన నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం హిజాబ్ అంశం కోర్టులో ఉందన్నారు నఖ్వీ.  కేంద్ర మైనారిటీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో 37 వ హునార్ హాత్ స్వదేశీ చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు.  హునార్ హాత్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రులు ముక్తార్ అబ్బాస్ నక్వీ, కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...స్వాతంత్య్రానంతరం తొలిసారిగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేతివృత్తులవారు. కళాకారుల స్వదేశీ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు మిషన్ మోడ్ పై కృషి చేయడం ప్రారంభించిందన్నారు.

 దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హస్త కళాకారుల ఆదాయం మెరుగుపడుతుందని నఖ్వీ అన్నారు.  హునార్ హాట్ కార్యక్రమం వల్ల వారసత్వ కళలు పునరుజ్జీవింప చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఆరేళ్లుగా హునర్ హాట్ ద్వారా కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. సుమారు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇందులో పాల్గొంటారని నఖ్వీ తెలిపారు. ఆసియా ఖందానికి చెందిన హస్త కళల ప్రదర్శన జరుగుతోందన్నారు. హునర్ హాట్ లో ప్రతిరోజు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు

దేశంలోని స్వదేశీ వంటకాలు ఇక్కడ లభిస్తాయన్నారు. హునర్ హట్ లో పాల్గొన్న కళాకారులు, శిల్పకారులు, చేతి వృత్తిదారులకు ధన్యవాదాలు తెలిపారు కేంద్రమంత్రి నఖ్వీ. వారి జీవితాలు బాగుపడేందుకు హునర్ హట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 
కళాకారులు, చేతివృత్తుల వారికి సాధికారత కల్పించే సమర్థవంతమైన ప్రయత్నం అయిన హునార్ హాట్ గత 7సంవత్సరాలలో సుమారు లక్షల మంది కళాకారులతో పాటు చేతివృత్తుల వారికి ఉపాధి అవకాశాలను అందించిందని తెలిపారు. ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ స్వయం సమృద్ధ భారతదేశం, వోకల్ ఫర్ లోకల్ ప్రచారానికి విశ్వసనీయమైన బ్రాండ్ గా హునార్ హాట్ మారిందన్నారు.

హునార్ హత్  కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ., ఎమ్మెల్యే రఘు నందన్.. లక్ష్మణ్.,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కళాకారుల చేతి వృత్తుల వారి విలువైన వారసత్వాన్ని రక్షించడానికి,సంరక్షిండానికి ప్రోత్సహించడానికి హునార్ హాత్ కార్యక్రమం. 
భారతీయ కళలు, సంప్రదాయలతో కూడిన వివిధ రకాల వస్తువుల ప్రదర్శన అమ్మకం, వంటకాలు, మరియు సంస్కృతుల సమ్మేళనం..
మార్చి 6వరకు ఎన్టీఆర్ స్టేడియంలో   హునార్ హాత్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. హునార్ హత్ ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.