- విలీన ప్రక్రియలో కార్మిక సంఘం ప్రతినిధుల భాగస్వామ్యం చేస్తాం: ఈడీ శ్రీధర్
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ ఆర్టీసీలో త్వరలో యూనియన్వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఛిరకాల డిమాండ్ అయిన ప్రభుత్వంలో విలీన ప్రక్రియకు గవర్నమెంట్చర్యలు తీసుకుంటుందన్నారు. శనివారం జేబీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తామన్నారు. వారి నుంచి వచ్చే విలువైన సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలనకు పంపి, అందరికీ ఆమోదయోగ్యంగా విలీన ప్రకియ ఉండేలా చూస్తామని తెలిపారు.
