ఏపీలో అన్ లాక్4 గైడ్ లైన్స్ విడుదల

ఏపీలో అన్ లాక్4 గైడ్ లైన్స్ విడుదల

ఈనెల 21 నుంచి 9,10 తరగతులు.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు స్కూళ్లు.. కాలేజీలకు వెళ్లేందుకు అనుమతి

తల్లిదండ్రులతో రాతపూర్వక అనుమతి ఉంటేనే ఎంట్రీ

పీజీ, పీహెచ్ డీ విద్యార్థులు కూడా కాలేజీలకు వెళ్లొచ్చు

రాజకీయ, విద్య, మతపరమైన సమావేశాలకు 100 మంది వరకు అనుమతి

స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు తెరచుకోవచ్చు

ఈనెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి

సినిమా హాళ్లు.. స్విమ్మింగ్ పూల్స్.. ఎంటర్ టైన్ మెంట్ పార్కులకు నో…

అమరావతి: కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఏపీలో అమలు చేసే అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్‌ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అదే రోజునుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరచుకునేందుకు అనుమతినిచ్చింది. 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ నెల 20 నుంచి పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులకు అనుమతి నిరాకరించింది.