మున్సిపాలిటీల్లో ఎర్లీ బర్డ్ స్కీంకు అపూర్వ స్పందన

మున్సిపాలిటీల్లో ఎర్లీ బర్డ్ స్కీంకు అపూర్వ స్పందన

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.222.85 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఈసారి కూడా ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వినియోగదారులకు 5% రాయితీ  ఇస్తూ  కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ‘ఎర్లీ బర్డ్‌‌ స్కీం’ తీసుకువచ్చింది. 5% రాయితీని వినియోగించుకొని పెద్ద ఎత్తున పన్నులు చెల్లించడంతో నిరుటితో పోల్చితే ఈ ఏడాది 82% పన్నులు అదనంగా వసూలైనట్లు సీడీఎంఏ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌‌లలో కలిసి 3,53,782 మంది వినియోగదారులు ఏప్రిల్‌‌ 30 (శనివారం) నాటికి రూ.222.85 కోట్ల ఆస్తి పన్ను చెల్లించారు. ఇప్పటి వరకు అత్యధికంగా 2020–-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 129.67 కోట్ల పన్నులు వసూలు కాగా ఈ ఏడాది దానిని అధిగమించారు. 
అత్యధిక శాతం జహీరాబాద్.. 
అత్యధిక మొత్తం వరంగల్
ఆస్తి పన్ను వసూళ్లలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌‌ మున్సిపాలిటీ 63.06 శాతం కలెక్షన్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 3.97 శాతం పన్ను వసూళ్లతో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇక్కడ రూ.86.29 లక్షల పన్నులు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.3.43 లక్షలు మాత్రమే కలెక్ట్ అయ్యింది. ఇక వసూలైన మొత్తం ప్రకారం వరంగల్‌‌ కార్పొరేషన్‌‌లో రూ.20.61 కోట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో ఉంది. 

 

 

ఇవి కూడా చదవండి

ట్రాఫిక్ రూల్స్.. 5 పాయింట్లకు మించితే వాహనం సీజ్‌

వచ్చే ఏడాది నుంచి పల్లె విద్యార్థులకు ఇంటి వద్దకే వర్సిటీలు

మన రక్తంలో మైక్రో ప్లాస్టిక్‌‌!

దరఖాస్తులు క్లియరైనా నిధులు విడుదల​ చేస్తలె