గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ల ప్యాంట్లు తడుస్తున్నయ్ : యూపీ సీఎం యోగి

గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ల ప్యాంట్లు తడుస్తున్నయ్ : యూపీ సీఎం యోగి
  • గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ల ప్యాంట్లు తడుస్తున్నయ్
  • ప్రాణాల కోసం పారిపోతున్నరు :  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

లక్నో : గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్, పొలిటీషియన్ అతిక్ అహ్మద్‌‌‌‌‌‌‌‌కు శిక్ష పడ్డాక రాష్ట్రంలోని గ్యాంగ్​స్టర్లు ప్యాంట్లు తడుపుకుంటున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2006లో ఉమేశ్​ పాల్​ కిడ్నాప్​ కేసులో అతిక్​తో పాటు మరో ఇద్దరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారన్నారు. యోగి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు యూపీలో వ్యాపారులు, ఇన్వెస్టర్లను, ప్రజలను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన మాఫియా, గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు చట్టం, లా అండ్ ఆర్డర్ అంటే గౌరవం ఉండేది కాదని, ఇప్పుడు వీటి పేర్లు వింటేనే భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోతున్నారని తెలిపారు.

ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్ట్​లను మాఫియా బెదిరించే రోజులు పోయాయని వివరించారు. పెట్టుబడిదారులందరికీ యూపీ సర్కార్​ సెక్యూరిటీ ఇస్తున్నదని, రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎవరూ ధిక్కరించలేరని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, కిడ్నాప్​లు, బెదిరింపులు, అత్యాచారాలు తగ్గిపోయాయని వెల్లడించారు. ఇప్పుడు రాష్ట్రంలో కోర్టులు, పోలీసులు అంటేనే గ్యాంగ్​స్టర్లు భయపడుతున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రజల భద్రత పూర్తిగా తమ ప్రభుత్వ బాధ్యతనేని స్పష్టం చేశారు.