ప్రతిపక్షాలను ఊడ్చేసిన కమలం

ప్రతిపక్షాలను ఊడ్చేసిన కమలం

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్  అసెంబ్లీ ఎన్నికల పలితాలు కొనసాగుతున్నాయి.  ఎగ్జిట్ పోల్ అంచనాల తగ్గట్లుగానే ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.  

  • త్రిపురలో 60 స్థానాలకు గానూ దాదాపు 31 స్థానాల్లో బీజేపీలో ఆధిక్యంలో ఉండగా,  లెఫ్ట్ పార్టీలు 16 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి. 
  • ఇక  నాగాలాండ్‌లో 59 స్థానాలకు గాను బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ ఆధిక్యంతో 35  స్థానాల్లో దూసుకుపోతోంది. ఎన్ పీ ఎఫ్ 5, కాంగ్రెస్ 3, ఇతరులు 17  స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 
  • మేఘాలయలో 59 స్థానాలకు గానూ ఎన్‌పీపీ 23, టీఎంసీ, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, యూడీపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో  ఉన్నారు.  

 

మేఘాలయలో ఎన్నికల ముందు సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్న బీజేపీ,  ఎన్ పీపీ ఈ ఎన్నికల్లో మాత్రం  విడివిడిగా పోటీ చేశాయి. 

కాగా గత నెల 16న 60 స్థానలకు త్రిపుర ఎన్నికలు జరగగా 27న మేఘాలయ, నాగాలాండ్‌ లలో ఎన్నికలు జరిగాయి.  ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ… ఎన్‌పీపీ అధికారంలో ఉంది. ఇక నాగాలాండ్‌లో నార్త్‌ ఈస్డ్‌ డెమొక్రటిట్‌ అలయన్స్‌ గవర్నమెంట్‌ కొనసాగుతోంది. ఇక ఈ ఫలితాలతో పాటుగా దేశవ్యాప్తంగా జరిగిన 7 బైపోల్ ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.