గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని 5వ ఇంక్లైన్ ఏరియాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏడాదిగా కిరాయి కట్టకపోవడంతో ఆ ఇంటి యజమాని తాళం వేశాడు. 5వ ఇంక్లైన్ ఏరియాలో ఆదర్శ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఎన్జీఓ ఆధ్వర్యంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఏడాదిగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని రేగడి రాజేశ్ శనివారం సెంటర్‌కు తాళం వేశాడు. వెంటనే స్థానిక సిబ్బంది ఎన్జీవో నిర్వహకుడు నరసింహులుకు సమాచారం అందించడంతో రెండు రోజుల్లో కిరాయి చెల్లిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో సెంటర్‌ను తెరిచారు.

