
- పరారీలో మరొకరు..కేసు నమోదు
ఉప్పల్, వెలుగు : గంజాయి అమ్ముతున్న ముగ్గురిని ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు కు చెందిన ఆకుల మిత్ర చైతన్య, నిట్టూరుకు చెందిన మహమ్మద్ లతీఫ్ సిటీలో ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా100 గ్రాములు దొరికింది. దర్యాప్తులో భాగంగా మీర్ పేట్ పరిధి ద్వారకామయి కాలనీకి చెందిన దమ్మని అరవింద్, బండి సాయి చరణ్ ఇంట్లో గంజాయి ఉందని తెలపగా.. వెళ్లి తనిఖీ చేయగా 5.317 కేజీలు దొరికింది.
వీరు ఏపీ బార్డర్‌లో సీలేరులో ఎండు గంజాయిని కిలో రూ. 4 వేలకు కొని తెచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా బండి సాయి చరణ్ పరారీలో ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని ఉప్పల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి. ఓంకార్ తెలిపారు. ఎక్సైజ్ ఎస్ఐలు శ్రీనివాసులు, పి. నరేశ్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
ధూల్‌పేట్‌లో 1.128 కిలోలు
మెహిదీపట్నం : ఆపరేషన్ ధూల్‌పేట్ తనిఖీల్లో భాగంగా మంగళవారం 1.128 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ధూల్‌పేట్‌లోని రహీంపురా సమీపంలోని ఖబరస్తాన్, గాంధీ చౌక్, పురానాపూల్ ప్రాంతాల్లో ఎస్ టీఎఫ్ టీమ్‌లు తనిఖీలు చేపట్టాయి. ఆయా ప్రాంతాల్లో 1.128 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఎస్ టీఎఫ్ టీమ్ లీడర్ ఎన్. అంజిరెడ్డి తెలిపారు.
గుప్పానగర్‌కు చెందిన దీపక్, ఇందిర నగర్, ధూల్ పేట్ లో అమ్మకాలు సాగిస్తుండగా పట్టుకున్నట్టు చెప్పారు. 10 గ్రాములకు రూ. 500 ఫోన్ పే ద్వారా తీసుకుంటూ సరఫరా చేస్తున్నాడని విచారణలో నిందితుడు వెల్లడించారు. గంజాయి అమ్మకాలు సాగించే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.