పేషెంట్లకు పునర్జన్మ ఇచ్చేది డాక్టర్లు : ఉప్పల శ్రీనివాస్ గుప్తా

పేషెంట్లకు పునర్జన్మ ఇచ్చేది డాక్టర్లు :  ఉప్పల శ్రీనివాస్ గుప్తా

ఎల్ బీ నగర్,వెలుగు: ప్రాణాలను అరచేతుల పెట్టుకొని వచ్చే పేషెంట్లకు భరోసా ఇచ్చి, పునర్జన్మను ప్రసాదించేవారు డాక్టర్లు అని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నేత ఉప్పల శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. సోమవారం జాతీయ డాక్టర్స్ డేను పురస్కరించుకొని నాగోల్ లోని సుప్రజ ఆస్పత్రి ఆధ్వర్యంలో 3కే రన్ నిర్వహించగా.. ఆస్పత్రి నుంచి అల్కాపురి చౌరస్తా వరకు కొనసాగింది.

ముందుగా డాక్టర్లను సన్మానించి కేక్ కట్ చేసిన అనంతరం ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు.  కార్యక్రమంలో సుప్రజ ఆస్పత్రి ఎండీ శిగ విజయ్ కుమార్, ఎల్ బీనగర్ ఏసీపీ కృష్ణయ్య గౌడ్, ఎక్సైజ్ ఏసీపీ గణేశ్, ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.