ఉప్పెనలా వ్యూస్: రిలీజ్ కు ముందే సెన్సేషన్

ఉప్పెనలా వ్యూస్: రిలీజ్ కు ముందే సెన్సేషన్

తన నటనను అందరికీ పరిచయం చేయకముందే పాటతో ఫేమస్ అయిపోయాడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. అతను నటిస్తున్న ‘ఉప్పెన’ సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌‌ సెన్సేషన్ సృష్టిస్తోంది. దేవిశ్రీప్రసాద్ ట్యూన్ చేసిన ఈ పాటకు యూట్యూబ్‌ లో నూట యాభై మిలియన్ వ్యూస్ వచ్చాయి. శ్రీమణి, రఖీబ్ లిరిక్స్ అందించారు. జావెద్ ఆలీ, శ్రీకాంత్ చంద్ర పాడారు. యూత్‌ ఫుల్‌ గా ఉండటంతో పాట పెద్ద హిట్టయ్యింది. ఈ సినిమాలోని ‘రంగులద్దుకున్న’ పాటకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంతో బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కృతీశెట్టి హీరోయిన్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. సాయిచంద్ , బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.