యూరియా అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకుంటాం

యూరియా అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకుంటాం

చేర్యాల, వెలుగు: జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి హెచ్చరించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల చేర్యాల మండలంలోని శ్రీసాయి శివ ఫెర్టిలైజర్ సేల్స్ షాప్ యజమాని చేతిరెడ్డి సందీప్ రెడ్డి ఈ-పాస్ మిషన్ ద్వారా హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ డీలర్స్ నుంచి 6,429 బ్యాగుల యూరియాను తీసుకొని, దాన్ని కన్ఫర్మేషన్ చేయకుండా, రైతుల ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్లే కొన్నట్లు చూపిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. 

యూరియాను మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూజ్ చేసిన అతడిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారని, అలాగే అతడి లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యవసాయ శాఖ రద్దు చేసిందని తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని శ్రీఆంజనేయ ఫర్టిలైజర్స్, శ్రీగణేష్ ట్రేడర్స్ అనే హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ డీలర్ల నుంచే సందీప్ రెడ్డికి యూరియా సరఫరా అయిందని, ఇందులో వారి ప్రమేయం కూడా ఉండటంతో ఆ రెండు షాపుల లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సైతం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ యూరియా డైవర్షన్, అక్రమాలపై సరైన పర్యవేక్షణ చేయనందుకు చేర్యాల ఏఓ భోగేశ్వర్ స్వామిని సస్పెండ్ చేశామని, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతరులపై కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.