ఆటో బోల్తా... గుడ్ల కోసం ఎగబడ్డ జనం .. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఘటన

ఆటో బోల్తా... గుడ్ల కోసం ఎగబడ్డ జనం  .. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఘటన

కోడిగుడ్ల లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా పడగా.. గుడ్లను ఎత్తుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రాజీవ్​రహదారిపై గల శంకర్​నగర్​వద్ద ఆదివారం కోడి గుడ్ల లోడ్​తో వెళ్తున్న టాటా ఎస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆటో డ్రైవర్​కు గాయాలు కావడంతో ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్​కు తరలించారు. కాగా, ప్రమాదానికి గురైన వాహనంలో ఉన్న కోడి గుడ్లను ఎత్తుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఒక్కొక్కరు ట్రేలకొద్దీ గుడ్లను ఎత్తుకెళ్లారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు అండగా నిలవాల్సింది పోయి.. గుడ్లను ఎత్తుకెళ్లడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.