తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (TASA) ఆహ్వానం మేరకు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరారు మంత్రి సీతక్క. గురువారం ( అక్టోబర్ 1 ) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంత్రి సీతక్క దక్షిణాఫ్రికా పర్యటనకు పయనమయ్యారు.
ఈ పర్యటనలో భాగంగా పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో కూడా పాల్గొననున్నారు సీతక్క. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరిన మంత్రి సీతక్కకు ఘనంగా వీడ్కోలు పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు.
