అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి

అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి

కాంగ్రెస్ పార్టీ తరపున లేఖ రాసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

హైదరాబాద్: అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సీఎల్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి సీఎల్పీ తరపున లేఖ  రాసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గతంలో విద్యుత్ బిల్లులను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేశామని గుర్తు చేసిన ఆయన గతంలో మాదిరిగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలన్నారు. రైతుల ఆందోళన అర్థం చేసుకుని వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వలన దేశవ్యాప్తంగా రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని, ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో టీఆర్ఎస్ మంత్రులంతా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన నాలుగు రోజులకే ముఖ్యమంత్రి కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని, అలాగే రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామనే నిర్ణయం తీసుకున్నారని, మీ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మాకు అనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని పంటలకు సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా అన్ని కేంద్రాలలో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని అంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

ఇవీ చదవండి

వాట్సప్ కొత్త పాలసీతో ఊపందుకున్నసిగ్నల్, టెలిగ్రామ్

పక్షుల సేఫ్టీ కోసం ఈ కైట్స్ ను వాడండి

బ్రౌన్‌ రైస్‌.. వైట్‌రైస్‌ ఏది మంచిది?