వీసా దరఖాస్తు సేవలకు మూడు రోజులు అంతరాయం..

వీసా దరఖాస్తు సేవలకు మూడు రోజులు అంతరాయం..

దేశంలో మూడు రోజుల పాటు వీసా దరఖాస్తు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. జులై 12వ తేదీ బుధవారం నుంచి జులై 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు వీసా దరఖాస్తు సేవలను మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. వీసా దరఖాస్తుతో పాటు..వీసా అపాయింట్ మెంట్లు, ఫీజు చెల్లింపు సేవలను ఈ మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. 

ఎందుకంటే..

భారత్ లో అమెరికా వీసా ప్రాసెసింగ్ ను నిర్వహించే  VFS గ్లోబల్ సంస్థ కొత్త ఫ్లాట్ ఫారమ్ కు మారుతున్నందున జులై 12వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ వీసా దరఖాస్తు సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ లోని అమెరికా రాయబార కార్యాయలం వెల్లడించింది. దీని ప్రకారం కాల్స్, ఫీజు చెల్లింపులు, వీసా అపాయింట్ మెంట్ బుకింగ్ లకు సంబంధించిన సేవలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండవని యూఎస్ ఎంబసీ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ సేవలు జులై15వ తేదీన పునఃప్రారంభించబడతాయని స్పష్టం చేసింది.