వడదెబ్బ ముప్పు!.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...

వడదెబ్బ ముప్పు!..  తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...

రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. ఎండల భయంతో బయట అడుగుపెట్టాలంటేనే జనం జంకుతున్నారు. దీంతో చాలామంది ఇండ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఇంట్లో ఉన్నప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

 తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ... 

  •     రూమ్ టెంపరేచర్ 26 నుంచి 28 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి. 
  •     ప్రతి అరగంటకు ఒకసారి వాటర్ తాగుతూ ఉండాలి. రోజుకు కనీసం 4 నుంచి 6  లీటర్ల వాటర్ తాగాలి. 
  •     ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాటన్​దుస్తులనే వాడాలి. 
  •     కిటికీలు, డోర్లు ఓపెన్ చేసి ఉంచాలి. వేడిగాలి నేరుగా లోపలికి రాకుండా కర్టెన్స్​కట్టాలి. 
  •     చల్లగాలి కోసం అవసరమైతే కిటికీలకు తడి పరదాలు, థర్మకోల్​షీట్స్ కట్టాలి.  
  •     వృద్ధులు ఎక్కువగా మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. 
  •     పిల్లలు, గర్భిణులు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. 
  •     వడదెబ్బ తగిలినవారు కూల్​డ్రింక్స్​అస్సలు తాగొద్దు. 
  •     సాధ్యమైనంత వరకు మసాల ఫుడ్స్​కు దూరంగా ఉండాలి. 
  •     వడదెబ్బకు గురైతే తడిబట్టతో బాడీని తుడుచుకోవాలి. 

ఇండ్లను చల్లగా ఉంచుకోవాలి.. 

సమ్మర్​లో బాడీ టెంపరేచర్​ 99 డిగ్రీల ఫారన్​ హీట్​​  దాటితే చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఆ వ్యక్తి డీహైడ్రేషన్​కు గురయ్యే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు వడదెబ్బ తగిలిన వ్యక్తి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. సాధ్యమైనంత వరకు ఇండ్లను కూల్​గా ఉంచుకోవాలి. రోజూ కనీసం 4 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ బారినపడిన వాళ్లు సాఫ్ట్ డ్రింక్స్​ తీసుకోకుండా నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు, ఓఆర్ఎస్​లాంటి ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవాలి. 
‑ డాక్టర్​విజయభాస్కర్, ఎథిక్స్ కమిటీ చైర్మన్, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ సెంటర్, హైదరాబాద్