ఫెడ్​ రేట్ల పెంపుతో మన మార్కెట్​ మునిగింది

ఫెడ్​ రేట్ల పెంపుతో మన మార్కెట్​ మునిగింది
  •     1,046 పాయింట్లు     పడిన సెన్సెక్స్‌
  •     యూఎస్‌ ఫెడ్ వైఖరితో  జాగ్రత్త పడుతున్న ఇన్వెస్టర్లు

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  ఈ వారంలో రెండో సారి ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు భారీగా పడ్డాయి. యూఎస్ ఫెడ్‌‌‌‌‌‌‌‌, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లు వడ్డీ రేట్లను పెంచడంతో పాటు, యూరప్‌‌‌‌‌‌‌‌లోని అతిపెద్ద ఎకానమీ అయిన జర్మనీకి గ్యాస్‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌ను రష్యా ఆపేయడంతో బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు గురువారం  పతనమయ్యాయి. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌, నిఫ్టీలు లాభాల్లో ఓపెన్ అయినప్పటికీ, హయ్యర్ లెవెల్స్‌‌‌‌‌‌‌‌ దగ్గర సస్టయిన్ కాలేకపోయాయి. యూరప్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు కూడా నష్టాల్లో ట్రేడవ్వడంతో మధ్యాహ్నం సెషన్‌‌‌‌‌‌‌‌లో ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు సుమారు 2 శాతం మేర పడ్డాయి. సెన్సెక్స్ గురువారం  1,046 పాయింట్లు (1.99 %) తగ్గి 51,496 వద్ద క్లోజయ్యింది. ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ ఏడాది కనిష్టానికి పడిపోయింది. నిఫ్టీ 332 పాయింట్లు (2.11 %) నష్టపోయి 15,361 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద రూ. 5.54 లక్షల కోట్లు తగ్గింది.  యూఎస్ ఎకానమీ  మాంద్యంలోకి జారుకుంటుందనే భయాలు పెరగడంతో  గ్లోబల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లతో పాటే మన మార్కెట్లూ పడ్డాయని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌ వినోద్‌‌‌‌‌‌‌‌ నాయర్ అన్నారు. ‘యూఎస్‌‌‌‌‌‌‌‌ ఎకానమీ గ్రోత్ అంచనాలను ఫెడ్ తగ్గించింది.  రానున్న  పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లలో కూడా వడ్డీ రేట్ల పెంపు ఎక్కువగానే ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. దీంతో యూఎస్ మాంద్యంలోకి జారుకుంటుందనే  భయాలు పెరిగాయి’ అని  పేర్కొన్నారు. కాగా, గత  ఐదు రోజుల్లో సెన్సెక్స్‌ 4,000 పాయింట్లు పడింది. ఇన్వెస్టర్లు రూ. 16 లక్షల కోట్లు నష్టపోయారు.

మార్కెట్ ఎందుకు క్రాష్ అయ్యిందంటే?

  • యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను75 బేసిస్ పాయింట్లు పెంచింది. అంతేకాకుండా రానున్న పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కూడా వడ్డీ రేట్ల పెంపు ఇలానే ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి కీలక వడ్డీ రేటు 3.40 శాతానికి పెరుగుతుందని అంచనా. ముందు ఈ అంచనా 2.80 శాతంగా ఉండేది. వడ్డీ రేట్లను వేగంగా పెంచితే ఎకానమీ మాంద్యంలోకి జారుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు.
  • మార్కెట్‌‌‌‌‌‌‌‌ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెళ్లిపోవడం కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 24,949 కోట్ల షేర్లను ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు అమ్మారు.
  • నార్డ్‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌ 1 పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌కు మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌ చేయాలనే కారణాలతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ దేశాలకు గ్యాస్ సప్లయ్‌‌‌‌‌‌‌‌ను రష్యా ఆపేసింది. దీంతో గ్యాస్ రేట్లు పెరిగితే  యూరప్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ మరింత  పెరుగుతుందనే భయాలు ఎక్కువయ్యాయి.