దుబాయ్‌‌‌‌‌‌‌‌లో బంగారం చౌక: కొనేవారు తగ్గడంతో.. భారీ డిస్కౌంట్స్ ఇస్తున్న సప్లయర్లు

దుబాయ్‌‌‌‌‌‌‌‌లో బంగారం చౌక: కొనేవారు తగ్గడంతో.. భారీ డిస్కౌంట్స్ ఇస్తున్న సప్లయర్లు

న్యూఢిల్లీ: దుబాయ్‌‌‌‌లో బంగారం చౌకగా దొరుకుతోంది. మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల  విమాన సర్వీస్‌‌‌‌లు ఆగిపోయాయి. దీంతో సప్లయర్లు బులియన్‌‌‌‌ను తరలించలేకపోతున్నారు. షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు అత్యధికంగా ఉండటం, డెలివరీ గ్యారెంటీ లేకపోవడం వల్ల చాలామంది బయ్యర్లు కొత్త ఆర్డర్లు ఇవ్వడం మానేశారు. దీంతో ట్రేడర్లు స్టోరేజ్, ఫండింగ్ ఖర్చులను తగ్గించుకునేందుకు  లండన్ గ్లోబల్ బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌ రేటు 5,050 డాలర్లలో (ఔన్స్‌‌‌‌కు) 30 డాలర్లు డిస్కౌంట్ ఇస్తున్నారు.

యూఏఈ, ముఖ్యంగా దుబాయ్ ఆసియాకు గోల్డ్ రిఫైనింగ్, ఎక్స్‌‌‌‌పోర్ట్ హబ్‌‌‌‌గా ఉంది.   స్విట్జర్లాండ్, యూకే, ఆఫ్రికా నుంచి షిప్‌‌‌‌మెంట్లు దూబాయ్‌‌‌‌ మీదుగా వెళతాయి. ఇరాన్ మిస్సైల్ అటాక్స్ వల్ల యూఏఈ ఎయిర్‌‌‌‌స్పేస్ పాక్షికంగా మూతపడింది.  విమాన సర్వీస్‌‌‌‌లు ఆగిపోవడంతో సౌదీ, ఒమన్ ఎయిర్‌‌‌‌పోర్ట్స్   ఉపయోగించడానికి దుబాయ్ ట్రేడర్లు  ఇష్టపడటం లేదు. డిస్కౌంట్స్ ఇవ్వడానికి ఇదొక కారణం.