అమెరికాలో ఏదో జరుగుతుంది.. అది ఏంటో స్పష్టంగా తెలియకపోయినా.. జరగబోయేది మాత్రం చాలా పెద్దదిగా అందరూ చర్చించుకుంటున్నారు. 2026, మే 23వ తేదీన జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అధ్యక్షుడు ట్రంప్ ఏదో తీవ్రమైన చర్య తీసుకోబోతున్నారా.. ఏం జరగబోతుంది.. ఏం చేయబోతున్నారు అనేది చర్చనీయాంశంగా ఉంది.
అమెరికాలో ఏదో జరగబోతుంది అనటానికి కారణాలు ఇవే..
>>> అధ్యక్షుడు ట్రంప్ న్యూజెర్సీలోని ఓ గోల్ఫ్ కోర్టుకు వెళ్లాల్సి ఉంది. షెడ్యూల్ అంతా రెడీ. ఆ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు.
>>> అధ్యక్షుడు ట్రంప్ తన కుమారుడి పెళ్లికి హాజరుకావాల్సి ఉంది. అలా జరగలేదు. కుమారుడి పెళ్లికి హాజరుకాలేదు.
>>> గోల్ఫ్ కోర్సు, కుమారుడి పెళ్లికి వెళ్లకుండా వైట్ హౌస్ కు వచ్చారు. తన అధికారులు అందర్నీ పిలిచారు.
>>> అమెరికా సైనిక, గూఢచార సంస్థలు మెమోరియల్ డే ప్రణాళికలన్నింటినీ రద్దు చేసుకున్నాయి.
>>> ఇరాన్‌పై కొత్త వ్యూహంతో.. సైనిక దాడికి సిద్ధంగా ఉన్నట్లుగా.. స్టాండ్ బై మోడ్‌లోకి వెళ్ళాయి.
>>> ఇదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అహ్మద్ షా ఇరాన్ రాజధాని టెహ్రాన్ వెళ్లారు. ప్రత్యేక విమానంలో.. ఎవరికీ తెలియకుండా వెళ్లి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
>>> అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఎవరూ ఊహించలేదు.
ఈ పరిణామాలు అన్నీ చకచకా జరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కొన్ని నిర్ణయాలు వెలువడుతున్నాయి. అధికార యంత్రాంగం అంతా వైట్ హౌస్ వైపు చూస్తుంది. అధ్యక్షుడు ట్రంప్ అన్ని పర్యటనలు రద్దు చేసుకుని వైట్ హౌస్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది.. ఇంటెలిజెన్స్ డైరెక్టర్ రాజీనామా ఎందుకు చేశారు.. ఇలాంటి పరిణామాలు అన్నీ చూస్తున్న అమెరికన్ పొలిటికల్ లీడర్లు.. ఏదో జరగబోతుంది అంటున్నారు. ఇదే ప్రచారం ఇప్పుడు అమెరికాలో ఊపందుకుంది.
