భారత్‌కు మరోసారి అమెరికా షాక్?.. కొత్త సుంకాల విధింపుకు ప్రతిపాదన!

భారత్‌కు మరోసారి అమెరికా షాక్?.. కొత్త సుంకాల విధింపుకు ప్రతిపాదన!

భారత్ కు అమెరికా మరోసారి షాకిచ్చింది. భారత్ లో తయారయ్యే వస్త్రాలు (అపారెల్స్), గార్మెంట్స్, ఇటుకలు, తివాచీలు, పాదరక్షలు,బాణసంచా వంటి చేతి వృత్తుల ఉత్పత్తులపై భారీ ఎత్తున సుంకాలు పెంచేందుకు  సిద్దమవుతోంది. మన దేశంనుంచి దిగుమతి అయ్యే ఈ వస్తువులతో అమెరికాలోని చేతి వృత్తుల కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారని సాకుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. వివరాల్లోకి వెళితే..  

భారత్ సహా 60 దేశాలపై ఫోర్స్ డ్ లేబర్ తయారీ వస్తువలపై భారీగా సుంకాలను విధించేందుకు అమెరికా సిద్దమవుతోంది. భారత్ సహా మరో 59 దేశాలపై అదనంగా 12.5% ​​సుంకాన్ని విధించాలని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) ప్రతిపాదించింది.ఫోర్స్ డ్ లేబర్ వస్తువుల దిగుమతులను నియంత్రించడంలో విఫలమయ్యాయని అందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు USTR తాజాగా ప్రకటనలో వెల్లడించింది. భారత్ -అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరుగుతున్న సమయంలో  ఈ ప్రకటన రావడం ఆందోళన కలిగిస్తోంది. 

యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ మాట్లాడుతూ, ఫోర్స్ డ్ లేబర్ తో తయారైన వస్తువుల దిగుమతిని అరికట్టడంలో ప్రధాన వాణిజ్య భాగస్వాములు అయిన భారత్ సహా వివిధ దేశాలు విఫలమయ్యాయి. దీంతో అమెరికా లేబర్ ప్రపంచ మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. అందుకే ఆయా దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అదనపు సుంకాలను విధించాలని యూఎస్‌టీఆర్ ప్రతిపాదించింది. ఇప్పటికే బలవంతపు కార్మిక దిగుమతుల నిషేధాన్ని అమలు చేస్తున్న  దేశాలకు 10 శాతం అదనపు సుంకం విధించే అవకాశం ఉంది. మిగిలిన దేశాలపై 12.5 శాతం అదనపు సుంకాన్ని విధించాలని ప్రతిపాదించారు.

ఫోర్స్ డ్ లేబర్ తయారీ వస్తువులంటే..

ప్రపంచవ్యాప్తంగా బలవంతపు కార్మికుల (Forced Labor) ద్వారా తయారవుతున్న వస్తువులలో వస్త్రాలు (అపారెల్స్), గార్మెంట్స్, ఇటుకలు, తివాచీలు, పాదరక్షలు,బాణసంచా అత్యంత సాధారణమైనవి. ఇవి కాకుండా అల్యూమినియం, సోలార్ ఉత్పత్తులు ,ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులు కూడా ఈ జాబితాలోకి రానున్నాయి.