అమెరికాలో ఉద్యోగాల సంక్షోభం.. మే నెలలో 80 వేల మంది తొలగింపు

అమెరికాలో  ఉద్యోగాల సంక్షోభం.. మే నెలలో 80 వేల మంది తొలగింపు

అమెరికా కలలు.. కల్లలు అవుతున్నాయి. ఇండియాకు ఏ మాత్రం తక్కువ కాకుండా.. ఉద్యోగుల తొలగింపులో పోటీ పడుతున్నాయి అమెరికా కంపెనీలు. ఆర్థిక మాంధ్యం భయంతో అమెరికాలోని కంపెనీలు సైతం.. తమ ఉద్యోగులకు ఊస్టింగ్స్ ఇస్తున్నాయి. అమెరికా చరిత్రలోనే ఉద్యోగుల తొలగింపులో.. 2023 మే నెల రికార్డ్ క్రియేట్ చేసింది. గత నెలలో 80 వేల మంది ఉద్యోగులను తొలగించాయి అమెరికా కంపెనీలు. అది కూడా అమెరికాలో పని చేస్తున్న వారినే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అమలు చేయటం ద్వారా.. మరో 3 వేల 900 మంది ఐటీ ఎంప్లాయిస్ తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఓవరాల్ గా మే నెలలో.. అమెరికాలో 85 వేల మంది వరకు నిరుద్యోగులు అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది షాక్ కు గురి చేస్తుండగా.. అగ్రరాజ్యంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మన సంగతి ఏంటీ అనే భయం.. ఇండియాలో ఐటీ ఉద్యోగుల్లో వ్యక్తం అవుతుంది.

ఎగ్జిక్యూటివ్ కోచింగ్ సంస్థ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ ఇంక్ ప్రకారం, US కంపెనీలు ఈ ఏడాది మేలో ఆశ్చర్యకరమైన ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇవి 2022 రికార్డును అధిగమించాయి.

US-బేస్డ్ ఓనర్స్ మే నెలలో 80 వేల 089 ఉద్యోగాల కోతలను ప్రకటించారు. గత ఏడాది ఇదే నెలలో 20 వేల 712 తొలగింపులతో పోలిస్తే-- ఇది 287% పెరుగుదల. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా కంపెనీలు 66 వేల 995 మంది ఉద్యోగులను తొలగించాయి. 2023, మే నెలలో తొలగించబడిన 80 వేల కంటే ఎక్కువ US కార్మికులలో, దాదాపు 3 వేల 900 మంది టెక్ పరిశ్రమలో ఉన్నారు. వీరంతా AI కారణంగా తమ ఉద్యోగాలను కోల్పోయారు.

ఈ సంవత్సరం ఇప్పటివరకు అంటే.. 2023 జనవరి నుంచి మే నెల వరకు.. అమెరికాలోని అన్ని కంపెనీలు 4 లక్షల 17వేల ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించాయి. 2022 అంటే.. గత సంవత్సరం ఇదే కాలంలో ప్రకటించిన ఒక లక్షా 694 కోతల కంటే 315% ఇది అధికం. ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన పలు కంపెనీలు.. ఉద్యోగ నియామకాలకు సైతం నిలిపివేస్తున్నాయి.