ఇకాటిబంట్ ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌కు యూఎస్​ఎఫ్​డీఏ ఆమోదం

ఇకాటిబంట్ ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌కు యూఎస్​ఎఫ్​డీఏ ఆమోదం

న్యూఢిల్లీ: ఆంజియోడెమా చికిత్సలో ఉపయోగించే జెనరిక్ ఐకాటిబంట్ ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌ను తయారు చేయడానికి,  మార్కెట్ చేయడానికి తమ యుజియా ఫార్మా స్పెషాలిటీస్‌‌‌‌‌‌‌‌కు యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ నుండి తుది ఆమోదం లభించిందని అరబిందో ఫార్మా బుధవారం తెలిపింది.  

యూఎస్ ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్​ఎఫ్​డీఏ)   సింగిల్-డోస్ ప్రీ-ఫిల్డ్ సిరంజీ  ఇకాటిబంట్​ ఇంజెక్షన్ 30 ఎంజీ/3 ఎంఎల్​ (10 ఎంజీ/ఎంఎల్​) కోసం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిందని అరబిందో ఫార్మా రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది. ఇది యూఎస్​ కంపెనీ టేకేడా ఫార్మాస్యూటికల్స్ రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ ఫిరాజిర్​ (ఇకాటిబంట్​ ఇంజెక్షన్)కి బయో ఈక్వివలెంట్. దీనిని వచ్చే నెల లాంచ్​ చేస్తామని అరబిందో ఫార్మా తెలిపింది. యూఎస్​లో ఈ డ్రగ్​కు 137 మిలియన్ల డాలర్ల మార్కెట్  ఉందని కంపెనీ తెలిపింది.