Ustaad Bhagat Singh Bookings: ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ నైజాం బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయి? బెనిఫిట్ షో ఉందా?

Ustaad Bhagat Singh Bookings: ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ నైజాం బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయి? బెనిఫిట్ షో ఉందా?

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించారు. సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19, 2026 న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్: నైజాం ప్రాంతంలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో గురువారం మార్చి 19న ఉదయం 7:30 నుండి షోస్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేస్తూ వివరాలు వెల్లడించింది. 

టికెట్ ధరలు: ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలు రెగ్యులర్ రేట్లే వర్తిస్తున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ. 295, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 175గా ఉంది. ఎటువంటి టికెట్ ధరల పెంపు వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించబడలేదు. హైదరాబాద్ లోని మెయిన్ థియేటర్లలోనే బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్నాయి.

అయితే, నైజాం ప్రాంతంలో, స్టార్ హీరో సినిమాలు టికెట్ రేటు పెంపు లేకుండా విడుదలై చాలా కాలం అయింది. అందువల్ల మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల థియేటర్లో ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఇతర థియేటర్ చైన్‌లలో కూడా బుకింగ్స్ స్టార్ట్ అవ్వనున్నాయి. 

బెనిఫిట్ షో: ప్రస్తుతానికి, నైజాంలో షోలు ఉదయం 7:30 నుండి స్టార్ట్ అవ్వనున్నాయి. ఉదయం 4 గంటలకు స్టార్ట్ అయ్యే బెనిఫిట్ షో గురించి ఇంకా స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం (రాత్రి 4 గంటల తర్వాత) షోకి పర్మిషన్ ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 500 (పన్నులతో కలిపి) గా నిర్ణయించబడింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో 10 రోజులపాటు రూ. 125, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100 పెంపు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

మాస్ దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కాంబోలో  గతంలో వచ్చిన  'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రిలీజ్ కు ముందే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ చిత్రం బుకింగ్స్‌లో టాప్ గేర్లో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది.

ఓవర్సీస్‌ ప్రీమియర్స్:  మార్చి 18న జరగనున్న నార్త్ అమెరికా ప్రీమియర్ల కోసం ఇప్పటికే 15000  వేలకు పైగా పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కేవలం అమెరికాలోనే సుమారు రూ.3 కోట్ల లోపు అడ్వాన్స్ సేల్స్ సాధించి పవన్ కళ్యాణ్ స్టామినాను నిరూపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పరిమితంగా ప్రారంభమైనప్పటికీ, గత 24 గంటల్లోనే జోరుగా  అమ్ముడవుతున్నాయి.

శ్రీలీల, రాశీ ఖన్నా  హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో పార్తిబన్, కె యస్ రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, గౌతమి, కె జి ఎఫ్ అవినాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు కంపోజ్ చేయగా, తమన్ బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు  అందించాడు.