ఓయూను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం : మంత్రి ఉత్తమ్

ఓయూను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం : మంత్రి ఉత్తమ్
  • నేషనల్ లెవెల్ సింపోజియంలో మంత్రి ఉత్తమ్

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. ఓయూలోని పలు ఇంజినీరింగ్  కాలేజీల్లో  విద్యార్థులు నేషనల్  లెవెల్  సింపోజియంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.వెయ్యి  కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఓయూను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత కృషి చేస్తున్నదని అన్నారు. ఓయూ వీసీ కుమార్, ఇంజినీరింగ్  కాలేజీ ప్రిన్సిపల్  చంద్రశేఖర్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.