ఓడినా సీఎం అయిన పుష్కర్ సింగ్ ధామి

ఓడినా సీఎం అయిన పుష్కర్ సింగ్ ధామి

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్ సింగ్ ధామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు ముహుర్తం కూడా ఫిక్స్ అయ్యింది. మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు, ఆయనతో పాటు మంత్రివర్గం కూడా ప్రమాణం చేయనుంది. డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ధామి ఓడిపోయినప్పటికీ.. ప్రభుత్వ పగ్గాలు ఆయనకే అప్పగించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. సోమవారం (మార్చి 21) జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్ సింగ్ ధామిని పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. డెహ్రాడూన్‌లో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర అబ్జర్వర్లుగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నేత మీనాక్షి లేఖి హాజరయ్యారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో పుష్కర్ సింగ్ ధామి ఓడిపోవడంతో సీఎంగా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై గత 11 రోజులుగా చర్చ జరుగుతోంది. . సీఎం రేసులో పుష్కర్ సింగ్తో పాటు మాజీ కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్, ఎమ్మెల్యే అనిల్ బలూనీ,  ధన్‌సింగ్ రావత్, సత్పాల్ మహరాజ్‌ల పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే బీజేపీ అధిష్ఠానం మాత్రం పుష్కర్ సింగ్ ధామి వైపే మొగ్గుచూపింది. 

ఇవి కూడా చదవండి:

ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్ కు భారీ రెస్పాన్స్